ISRO completes launch rehearsal of
PSLV-C51 mission
ప్రైవేటు ఉపగ్రహాల ప్రయోగానికి
పీఎస్‌ఎల్‌వీ-సీ51 సిద్ధం
ఇస్రో వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ-సీ51
ఈనెల 28న అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి
మోసుకువెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
(ఎస్‌డీఎసీ- షార్)లో ఇందుకు అంతా సిద్ధం చేశారు. గురువారం చేపట్టిన రిహార్సల్
కూడా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు పచ్చజెండా ఊపారు. 2021లో ఇస్రో ప్రయోగించే
తొలి ఉపగ్రహాలు ఇవే కాగా.. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)
నేతృత్వంలో అంతరిక్షంలోనికి పంపే తొలి వాణిజ్య ఉపగ్రహాలు కూడా ఇవే కానున్నాయి.
ఈనెల 28న ఉదయం 10:24 గంటలకు నింగిలోనికి దూసుకెళ్లే ఉపగ్రహాల్లో బ్రెజీలియన్ శాటిలైట్
అమెజానియా-1 భూపర్యవేక్షణకు సంబంధించిన కీలకమైన ఉపగ్రహం.
0 Komentar