ISRO Launches PSLV-C51 Carrying Brazil’s Amazonia-1 And 18 Other Satellites
ఇస్రో: 19 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ51
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
శాస్త్రవేత్తలు, దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్
సెంటర్ షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-51 వాహక నౌక నిప్పులు
చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం చేపట్టిన కౌంట్‌డౌన్ ప్రక్రియలో
భాగంగా పీఎస్‌ఎల్‌వ్వీ- సి-51 వాహక నౌకలోని వివిధ దశల్లో ఘన,
ద్రవ ఇంధనాలు నింపారు.
అనంతరం ముందుగా నిర్ణయించిన
సమయానికి, ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ
వాహకనౌక-సి51 (పీఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకె ళ్లింది. ఇది
ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగం కాగా, మొదటి ప్రయోగ
వేదిక నుంచి 39వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ వర్షన్‌లో
మూడోది. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్ దేశ
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని
ప్రత్యక్షంగా వీక్షించారు. పీఎస్‌ఎల్‌వీ-సి51 వాహకనౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజొనియా-1
ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు.
0 Komentar