JEE Main -2021 Admit Card Released
జేఈఈ (మెయిన్), నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్ లను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో కేంద్రం తన వైఖరి వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ హాల్
టికెట్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఏ) తన వెబ్ సైట్లో పొందుపరిచింది.
ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు... దరఖాస్తు సంఖ్య,
పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లను డౌన్లోడ్
చేసుకోవాలని ఎన్‌టిఏ సూచించింది.
అడ్మిట్ కార్డును https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులకు అప్లికేషన్ నెంబర్ పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష సమయంలో అభ్యర్థులు తీసుకెళ్లవలసిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్ లో అడ్మిట్ కార్డు ఒకటి. జేఈఈ మెయిన్ 2021 యొక్క పరీక్షా కేంద్రంలో ప్రవేశం పొందడానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి. అడ్మిట్ కార్డు ద్వారా, ఎన్‌టిఏ అభ్యర్థులకు ఎక్సామ్ డేట్, టైం అలానే ఎక్సామ్ సెంటర్ కేటాయిస్తారు.
అడ్మిట్ కార్డు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే పరీక్షలకు విడిగా విడుదల చేస్తారు. ఒక సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డు ఇతర సెషన్లకు చెల్లదు. ఇక జెఈఈ మెయిన్-2021 ఫిబ్రవరి 23 నుండి 26 వరకు రోజుకు 2 షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి 6 వరకు జరుగుతుంది.
0 Komentar