Karnataka Govt Declares Vijayanagar as
31st District of State
కర్ణాటకలో 31వ
జిల్లా - విజయనగర
కర్ణాటకలో 31వ
జిల్లాగా విజయనగరను అధికారికంగా ప్రభుత్వం
ప్రకటించింది. బళ్లారి జిల్లా నుంచి వేరు చేసి హొసపేటె కేంద్రంగా విజయనగర
జిల్లాను ఏర్పాటుచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బళ్లారి జిల్లాలో ఐదు
తాలూకాలు, కొత్త జిల్లా విజయనగరలో ఆరు తాలూకాలుంటాయి. గత
ఏడాది నవంబరు 18న రాష్ట్ర మంత్రివర్గం విజయనగరను ప్రత్యేక
జిల్లాగా చేయాలని తీర్మానించింది. విజయనగర జిల్లా ఏర్పాటుపై ఎటువంటి వ్యతిరేకత
లేదని ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరులో ప్రకటించారు.
ఇది ప్రసిద్ధ విజయనగర
సామ్రాజ్యం యొక్క పూర్వ రాజధాని, హంపి మరియు విరూపాక్ష
ఆలయం ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతం విజయనగర సామ్రాజ్యం పాలించింది మరియు అనేక
చారిత్రక ప్రదేశాలకు నిలయం.
0 Komentar