Kotak Mahindra Bank Announces Launch of Kotak Remit on Mobile
మొబైల్ నుంచే విదేశాలకు డబ్బు
పంపొచ్చు
- కోటక్ రెమిట్ సేవతో సాకారం
కోటక్ బ్యాంక్ ఖాతాదార్లు ఇకపై తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా విదేశాలకు నగదు బదిలీ చేసే సౌలభ్యం కలిగింది. ఈ బ్యాంక్ అవుట్‌వార్డ్ ఫారెక్స్ రెమిటెన్స్ సేవల్ని సోమవారం నుంచి ప్రారంభించింది. కోటక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ సాయంతో కోటక్ రెమిట్ సేవను ఖాతాదార్లు వినియోగించుకుని, విదేశాల్లోని తమ వారికి నేరుగా డబ్బులు పంపుకోవచ్చని బ్యాంక్ పేర్కొంది.
అనుమతి ఉన్న దేశాలకు రోజుకు 25,000 డాలర్ల వరకు ఎలాంటి భౌతిక ధ్రువీకరణలు అవసరం లేకుండా నిధులు పంపించవచ్చని
వెల్లడించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 2,50,000
డాలర్ల వరకే ఇలా నిధులు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. కోటక్ రెమిట్ ద్వారా
యూఎస్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, యూకే
పౌండ్ స్టెర్లింగ్, హాంకాంగ్ డాలర్, సౌదీ రియాల్, కెనడా డాలర్, సింగపూర్
డాలర్, యూరో, జపాన్ యెన్ వంటి 15 కరెన్సీలను పంపుకోవచ్చని (రెమిటెన్స్) కోటక్ మహీంద్రా బ్యాంక్
ప్రెసిడెంట్, కో-హెడ్ - ట్రెజరీ, గ్లోబల్
మార్కెట్స్ ఫణి శంకర్ వెల్లడించారు.
0 Komentar