LIC of India Launches New Policy 'Bima Jyoti' Plan, Details Here
ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ బీమా జ్యోతి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 2021లో కొత్త పాలసీని విడుదల చేసింది. బీమా రక్షణతో పాటు పొదుపునకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ‘బీమా జ్యోతి’ పేరుతో తెచ్చిన ఈ పాలసీని కనీసం రూ.లక్ష నుంచి తీసుకోవచ్చు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.
పాలసీ వ్యవధి 15, 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. అయితే, ఇది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ప్రీమియం కొంత కాలం పాటే చెల్లిస్తాం. బీమా మాత్రం తర్వాత కొన్నేళ్ల వరకు వర్తిస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రీమియం చెల్లించాల్సిన అవధి మనం తీసుకున్న పాలసీ అవధి కంటే ఐదేళ్లు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనం పాలసీ అవధిని 20 ఏళ్లుగా ఎంచుకుంటే.. ప్రీమియం చెల్లించాల్సింది 15 ఏళ్ల వరకు మాత్రమే.
ఇక ఈ పాలసీ ద్వారా అందిస్తున్న మరో ప్రయోజనం కచ్చితమైన అదనపు చెల్లింపు (గ్యారంటీ అడిషన్). ప్రతి రూ.1,000 పాలసీ మొత్తానికి ఏడాదికి రూ.50 జమ చేస్తారు. అంటే ఏడాదికి ఐదు శాతం కచ్చితమైన రిటర్న్ లభిస్తుంది. అలా పోగైన మొత్తాన్ని పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అదనపు చెల్లింపుల్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉండదు. ఉదాహరణకు మీరు రూ.10 లక్షల పాలసీని 20 ఏళ్లకు తీసుకున్నారు.
సంవత్సరానికి వెయ్యికి రూ.50 లెక్కన రూ.10 లక్షలకు రూ.50,000 అదనంగా చేరతాయి. అలా 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది రూ.50వేల చొప్పున అందుతాయి. అంటే పాలసీ కాలపరిమితి ముగిసే నాటికి రూ.10 లక్షలు అదనంగా వస్తాయి. ప్రతి ఏటా అదనంగా వస్తున్న రూ.50వేలపై ఎలాంటి రిటర్న్స్ ఉండవన్న విషయం గమనార్హం. ఇక ఇక దీంట్లో ఎలాంటి బోనస్‌లూ ఉండవు.
0 Komentar