NATA 2021 First, Second Test Dates
Announced; Registration Begins Soon
నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్
ఆర్కిటెక్చర్ (నాటా) -2021 పరీక్ష తేదీల విడుదల
నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్
ఆర్కిటెక్చర్ (నాటా) -2021 పరీక్ష తేదీలను కౌన్సిల్ ఆఫ్
ఆర్కిటెక్చర్ (సీఓఏ) ఫిబ్రవరి 26న ప్రకటించింది. మొదటి
టెస్ట్ ఏప్రిల్ 10, 2021న, రెండో
టెస్ట్ జూన్ 12, 2021న నిర్వహించనున్నట్లు తెలిపింది. 2006
సంవత్సరం నుంచి సీఓఏ ఆధ్వర్యంలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు
నిర్వహిస్తున్నారు.
సంబంధిత వివరాలను త్వరలో http://nata.in/ లేదా https://www.coa.gov.in/ వెబ్ సైట్లలో
పొందుపర్చనున్నారు. నాటా పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో డ్రాయింగ్,
విజువల్ కంపోజిషన్ పై నైపుణ్యాలను పరీక్షిస్తారు. పార్ట్-బిలో
సైంటిఫిక్ ఎబిలిటీ, జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి
ప్రశ్నలడుగుతారు.
0 Komentar