Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCHM JEE-2021: National Council for Hotel Management Joint Entrance Examination

 

NCHM JEE-2021: National Council for Hotel Management Joint Entrance Examination

ఎన్‌టీఏ-ఎన్‌సీహెచ్ఎం జేఈఈ 2021

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2021 సంవ‌త్సరానికి నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ‌(ఎన్‌సీహెచ్ఎం-జేఈఈ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా 2021-2022 సంవ‌త్స‌రానికి దేశ‌వ్యాప్తంగా బీఎస్సీ(హాస్పిటాలిటీ, హోట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్) కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. 

వివ‌రాలు 

* నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ‌(ఎన్‌సీహెచ్ఎం-జేఈఈ) 2021 

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 01.07.2021 నాటికి జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల గ‌రిష్ఠ వ‌య‌సు 25 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీల‌కు 28 ఏళ్లు మించ‌కూడ‌దు. 

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష‌ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌ల‌(ఎంసీక్యూ) రూపంలో ఉంటుంది. కింద సూచించిన విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి. 

* న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ అండ్ అన‌లైటిక‌ల్ ఆప్టిట్యూడ్ - 30 ప్ర‌శ్న‌లు 

* రీజనింగ్ అండ్ లాజిక‌ల్ డిడ‌క్ష‌న్ - 30 ప్ర‌శ్న‌లు 

* జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ - 30 ప్రశ్న‌లు 

* ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 60 ప్ర‌శ్న‌లు 

* ఆప్టిట్యూడ్ ఫ‌ర్ స‌ర్వీస్ సెక్ట‌ర్ - 50 ప్ర‌శ్న‌లు 

* మొత్తం 200 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 4 మార్కులు ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1మార్కు తీసేస్తారు. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్, హిందీ మాధ్య‌మాల్లో ఉంటుంది. ప‌రీక్షా స‌మ‌యం 3 గంట‌లు(180 నిమిషాలు) ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ- రూ.1000, జ‌న‌ర‌ల్‌-ఈడ‌బ్ల్యూఎస్‌-రూ.700, ఎస్సీ/ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ-రూ.450, ట్రాన్స్‌జెండ‌ర్‌-రూ.450 చెల్లించాలి. 

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.05.2021. 

* ప‌రీక్ష తేది: 12.06.2021.

WEBSITE

INFORMATION BULLETIN

WEB NOTE

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags