NEET PG 2021 – Exam Registration begins
ఎన్‌ఈఈటి పిజి 2021 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
మార్చి 15
రిజిస్ర్టేషన్స్‌కు చివరితేది
ఏప్రిల్ 18 నీట్ పీజీ ప్రవేశ పరీక్ష
కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో వివిధ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో NEET PG 2021 ఎగ్జామ్ ప్రకటన కూడా విడుదలైంది. ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేటి (ఫిబ్రవరి 23) సాయంత్రం 3 గంటల నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రారంభించనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎన్‌బీఏ అధికారిక వెబ్ సైట్ https://nbe.edu.in/ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభ
తేదీ: ఫిబ్రవరి 23, 2021
అప్లికేషన్ల ప్రక్రియ ఆఖరి తేదీ:
మార్చి 15,
2021
NEET PG 2021 అడ్మిట్
కార్డులు విడుదల తేదీ: ఏప్రిల్ 12, 2021
NEET PG 2021 పరీక్ష తేదీ:
ఏప్రిల్ 18, 2021
పరీక్ష ఫలితాలు విడుదల: మే 31, 2021
పీజీ ఎంట్రెన్స్ కు హాజరయ్యే
అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తించబడిన సంస్థ నుంచి జారీ
అయిన MBBS
సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. MCI లేదా స్టేట్
మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
కూడా కలిగి ఉండాలని కోరింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న అభ్యర్థలు జూన్ 30,
2021లోపు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసి ఉండాలని సూచించింది. ఈ పరీక్ష
ద్వారా దేశవ్యాప్తంగా 6,102 సంస్థల్లో మాస్టర్ ఆఫ్ సర్జరీ 10,821 సీట్లను, డాక్టర్ ఆఫ్ మెడిసిన్-MD 19,953 సీట్లను భర్తీ చేయనున్నారు.
0 Komentar