OAMDC: Second Phase Counselling for Degree Courses Will Begin from February 4
ఏపీలో ఈనెల 4 నుంచి డిగ్రీ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్
డిగ్రీలో మొత్తం సీట్లు 4,95,956
మొదటివిడతలో 1,95,645 మందికి సీట్లు
వెబ్‌సైట్‌లో కాలేజీల సమాచారం
మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో
పూర్తి చేసుకునే అవకాశం
ఏపీలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించి తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికావడంతో ఉన్నత విద్యామండలి ఈనెల (ఫిబ్రవరి) 4వ తేదీనుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. విద్యార్థులు గతంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చునో, లేదంటే దగ్గర్లోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కాలేజీల్లో, నచ్చిన కోర్సుల్లో సీటు కోసం ఆప్షన్ ఇచ్చి సీట్లు పొందవచ్చు.
వెబ్‌సైట్‌లో కాలేజీల సమాచారం:
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేట్ అన్ ఎయిడెడ్.. మొత్తం 1,301 కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి 4,95,956 సీట్లున్నాయి. కాలేజీలో ఉన్న కోర్సులు, సదుపాయాలు, ల్యాబ్‌లు, లెక్చరర్లు, న్యాక్ గుర్తింపు వంటి అన్ని వివరాలను ఉన్నత విద్యామండలి.. వెబ్ కౌన్సెలింగ్ కోసం ఏర్పాటుచేసిన వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా ఉంచింది. ఈ వివరాలు పరిశీలించిన విద్యార్థులు తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వొచ్చు.
0 Komentar