యాపిల్ కంప్యూటర్ ధర రూ. 11 కోట్లు
అమెరికాకు చెందిన కృష్ణ బ్లాకే అనే
వ్యక్తి యాపిల్ 1 కంప్యూటర్‌ను 1978లో
కొనుగోలు చేశాడట. అయితే, ఇటీవల eBayలో
అమ్మాకానికి పెట్టిన 45 ఏళ్ల నాటి కంప్యూటర్‌ను ఓ కొనుగోలుదారుడు ఏకంగా ధర 15లక్షల డాలర్లు (రూ.11 కోట్లు) చెల్లించి మరీ సొంతం చేసుకున్నాడు. మరి అది
మాములు కంప్యూటర్ కాదు.. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.. స్టీవ్
వొజ్నియాక్ 1976లో ఆవిష్కరించిన తొలి యాపిల్ 1 కంప్యూటర్ అది.. ఇప్పటికీ
కంప్యూటర్ పని చేస్తుండటం విశేషం.
చెక్కపెట్టెలో కీబోర్డుతో ఉండే ఈ
కంప్యూటర్‌తోపాటు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే మాన్యువల్ బుక్,
ఔట్‌పుట్ కోసం సోనీ టీవీ-115 మానిటర్ వస్తాయి. ఈ కంప్యూటర్‌లో
బేసిక్ లాంగ్వేజ్, గేమ్స్, లో అండ్
హై మొమోరీ టెస్ట్, యాపిల్ 30వ
వార్షికోత్సవం వీడియో ఉన్నాయట. ‘‘ఈ కంప్యూటర్ ఎంతో విలువైనది. పాడయ్యే లేదా
దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కొత్త యజమాని చెంతకు చేరేవరకు ఈ
కంప్యూటర్‌ను ఫ్లోరిడాలోని బ్యాంక్ లాకర్‌లో భద్రంగా దాచిపెట్టాను’’అని కృష్ణ
వెల్లడించాడు.
0 Komentar