Pariksha Pe Charcha 2021: Classes 9-12
can apply till March 14
‘పరీక్షా పే చర్చ’ నమోదు గడువు మార్చి 14 - ఈసారి ఆన్‌లైన్‌లోనే నిర్వహణ
విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు
విద్యార్థుల్లో పరీక్షలపై ఒత్తిడి, భయం
పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’
కార్యక్రమం వచ్చే నెలలో జరగనుంది. అయితే కొవిడ్ వైరస్ కారణంగా ఈ ఏడాది ఈ సమావేశం
ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విటర్ ద్వారా
వెల్లడించారు.
‘మన ధైర్యవంతమైన ఎగ్జామ్ వారియర్లు పరీక్షలు సన్నద్ధమవుతున్న వేళ పరీక్షా పే చర్చ 2021 వచ్చేసింది. ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నా. రండి.. ఎలాంటి ఒత్తిడి లేకుండా చిరునవ్వుతో పరీక్షలకు హాజరవుదాం’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతేగాక, ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చ’లో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరుకావాలని ప్రధాని కోరారు.
ఈ చర్చలో పాల్గొనేందుకు
రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 14 వరకు నమోదు చేసుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
వెల్లడించారు. 9 నుంచి 12వ తరగతి
విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. 2018
నుంచి ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తున్నారు. పరీక్షలు రాసే
విద్యార్థులతో మోదీ సమావేశమై వారిలో ఒత్తిడిని పోగొట్టేలా ప్రసంగిస్తారు. వారి
సందేహాలు నివృత్తి చేస్తుంటారు.
0 Komentar