RRB NTPC 2021: 5th Phase Exam Dates Released
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఐదో దశ పరీక్ష తేదీలు విడుదల
మార్చి 4
నుంచి ఈ పరీక్షలు ప్రారంభం
రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐదో దశ పరీక్షల షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఐదో దశ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
పరీక్ష తేదీలివే:
మార్చి 4, 5, 7, 8, 9, 11, 12, 13, 14, 21, 27 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. దీంతోపాటు మార్చి 15, 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు తమ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ పంపించాలని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలి. ఈ ఆన్‌లైన్ పరీక్షకు దేశవ్యాప్తంగా 19 లక్షల మంది హాజరుకానున్నారు.
దశలవారీగా జరుగుతున్న ఆర్‌ఆర్‌బీ
ఎన్టీపీసీ పరీక్షలు డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు దశలు ముగిశాయి.
ప్రస్తుతం నాలుగో దశ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15న
ప్రారంభమైన నాలుగో దశ పరీక్షలు మార్చి 3న ముగియనున్నాయి. ఈ
పరీక్షలకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు
హాజరుకానున్నారు.
0 Komentar