SBI Home Loan: State Bank is offering
loans at 6.8% without processing fee till March – Check details
ఎస్‌బిఐ రుణ గ్రహీతలకు శుభవార్త
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తు్న్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారికి ఊరట కలుగనుంది. అయితే ఇది అందరికీ వర్తించదు.
హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు మాత్రమే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంటుందని స్టేట్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31 వరకు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకునే వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు మాత్రమే కాకుండా బ్యాంక్ నుంచి చౌక వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.8 శాతం నుంచి ప్రారంభమౌతోంది. బ్యాంక్ నుంచి పలు రకాల హోమ్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఎస్‌బీఐ.. హోమ్ లోన్స్ మార్కెట్‌లో
34 శాతం వాటాతో దూసుకెళ్తోంది. రోజుకు సగటున దాదాపు 1,000 మందికి ఎస్‌బీఐ హోమ్ లోన్స్ అందిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రధాన్ మంత్రి
ఆవాస్ యోజన PMAY స్కీమ్ కింద 2020
డిసెంబర్ చివరి నాటికి దాదాపు 2 లక్షల హోమ్ లోన్స్‌ను జారీ
చేసింది.
0 Komentar