SBI Is Giving Instant
Personal Loan of Rs 20 Lakh – Know the Details Here
ఎస్‌బిఐ గుడ్ న్యూస్. క్షణాల్లో
రూ.25 వేల నుంచి రూ.20 లక్షల రుణం!
లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? మీరు ఎస్‌బీఐ కస్టమరా? మీకు స్టేట్ బ్యాంక్‌లోనే శాలరీ అకౌంట్ ఉందా? అయితే మీరు సులభంగానే లోన్ పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. మిస్డ్ కాల్ ఇచ్చి కూడా లోన్ పొందొచ్చు.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో బ్యాంక్ రుణాలు కూడా ఒక భాగమని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ సులభంగానే రుణలు అందిస్తోంది. అయితే అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది.
స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అందిస్తోంది. బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కస్టమర్లు ఈ తరహా రుణాలు పొందొచ్చు. బ్యాంక్ ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు.
ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ కింద అర్హత కలిగిన వారు రూ.25 వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఈ రుణాలను వెంటనే పొందొచ్చు. నిమిషాల్లోనే బ్యాంక్ కస్టమర్ల అకౌంట్‌కు డబ్బులు వచ్చి చేరతాయి. తక్కువ డాక్యుమెంట్లతోనే పని పూర్తవుతుంది.
ఇకపోతే బ్యాంక్ నుంచి పొందే ఈ తరహా
రుణాలపై వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటుంది. వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతుంది. ఇతర బ్యాంకుల కన్నా ఇది తక్కువ వడ్డీ అని
చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే
ఈ లోన్ పొందాలంటే నెలకు కనీసం రూ.15 వేల వేతనం వస్తుండాలి.
All it takes is an SMS, to begin with your personal loan process.
— State Bank of India (@TheOfficialSBI) February 16, 2021
SMS <PERSONAL> on 7208933145.
To know more: https://t.co/TH5bnGWu1V pic.twitter.com/EJin90BhxV
0 Komentar