SC Dismisses Petition Seeking Extra
Attempts for UPSC Civils 2021
UPSC: సివిల్స్ అభ్యర్థులకు
మరో అవకాశానికి సుప్రీం నో
యూపీఎస్‌సీ అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం లేదని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో సివిల్స్ పరీక్ష రాయలేకపోయిన వారికి ఎటువంటి ఎక్స్‌ట్రా ఛాన్సు ఉండదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
కరోనా వైరస్ ఆంక్షల వల్ల సివిల్స్ పరీక్ష
రాయలేకపోయామని, మరో అవకాశం కల్పించాలంటూ సుప్రీంలో అభ్యర్థన
దాఖలైంది. ఆ కేసులో ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది. ఆ పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు త్రిసభ్య
ధర్మాసనం ఇవాళ ఏక వ్యాఖ్య తీర్పునిచ్చింది.
2020 నాటికి చివరి అవకాశం
కోల్పోతున్న వారికి మరోసారి సివిల్స్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చేందుకు
కేంద్ర ప్రభుత్వం తొలుత అంగీకరించింది. కానీ ఆ నిర్ణయాన్ని సుప్రీంకు వదిలేసింది.
కరోనా మహమ్మారి వల్ల పరీక్షలకు సరిగా ప్రిపేర్‌కాలేకపోయామని, అందుకే మరో ఛాన్సు ఇవ్వాలంటూ పిటీషనర్ తన అభ్యర్థనలో కోర్టును
కోరారు. వయసు మీరుతున్న వారికి కూడా మరో అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నారు.
0 Komentar