పది ప్రశ్నాపత్రంలో మార్పులతో బ్లూ ప్రింట్ విడుదల చేసిన ప్రభుత్వం
కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతోపాటు, పనిదినాల్లో భారీ కోత పడటంతో పరీక్షల నిర్వహ ణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కీలకమైన పదో తరగతికి సంబంధించి విద్యార్థుల్లో ఉన్న ఆందోళనలు తొలగించేలా సరళంగా రూపకల్పన చేసేలా చర్య లు తీసుకుంది. ఒకవైపు పనిదినాలకు అనుగుణంగా సిలబస్లో కోత విధించ డంతోపాటు, ప్రశ్నాపత్రాల తయారీ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా 11 పరీక్షా పేపర్ల స్థానంలో ఏడు పేపర్లను తీసుకొచ్చారు.
ప్రతి పరీక్షకు రెండున్నర గంటల
సమయం కేటాయిస్తూ పాఠశాల విద్యా శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది
జరిగే పబ్లిక్, అడ్వాన్డు సప్లిమెంటరీ పరీక్షలకు మాత్రమే ఈ నిర్ణయం
వర్తిస్తుంది. సామాన్య శాస్త్రం మినహా మిగిలిన పరీక్షల్లో ఆబ్జెక్టివ్, సంక్షిప్త, క్లుప్త, వ్యాస
రూపంలో ఇచ్చే 33 సమాధానాలకు వంద మార్కులు కేటాయించారు.
సామాన్య శాస్త్రంలో 2 పేపర్లతో 50
మార్కుల చొప్పున నిర్వహిస్తారు. జూన్ 7 నుంచి పరీక్షలు
జరగనున్నాయి.
0 Komentar