SSC: Multi-Tasking (Non-Technical) Staff Examination 2020
స్టాప్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నాన్‌టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు
దరఖాస్తు చేసుకోవచ్చు
రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలను స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) భర్తీచేస్తుంది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నాన్‌టెక్నికల్ పోస్టుల భర్తీకి ఈరోజే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 29న నోటిఫికేషన్ వెలువడాలి.. కానీ.. వివిధ కారాణాల వల్ల వాయిదావేశారు.
ముఖ్య సమాచారం:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
సాధించాల్సి ఉంటుంది.
వయసు: అభ్యర్థులు 18
నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్షలో రెండు
పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు
ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కోమార్కు చొప్పున మొత్తం 100
మార్కులకు పరీక్ష ఉంటుంది. గంటన్నర లోపు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు
ప్రశ్నకు 0.25 మార్కులు కోతవిధిస్తారు. పేపర్-2లో 50 మార్కులకు షార్ట్ ఎస్ఏ లేదా లెటర్ రైటింగ్‌పై
ప్రశ్నలు అడుగుతారు. దీనిని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ,
ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు
ఎలాంటి ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తులు
సమర్పించాల్సిన తేదీలు: 05.02.2021 నుండి 21.03.2021 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించడానికి
చివరి తేదీ మరియు సమయం: 21.03.2021 (23:30)
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి
చివరి తేదీ: 23.03.2021 (23:30)
ఆఫ్‌లైన్ చలాన్ ఉత్పత్తికి చివరి
తేదీ: 25.03.2021 (23:30)
చలాన్ ద్వారా చెల్లించడానికి చివరి
తేదీ (బ్యాంక్ పని సమయంలో): 29.03.2021
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
షెడ్యూల్ (టైర్ -1): 01.07.2021 నుండి 20.07.2021
టైర్- II పరీక్ష తేదీ (వివరణాత్మక పేపర్): 21.11.2021
0 Komentar