Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Students of Classes 6 To 12 To Receive Free Textbooks and Above Class 9 Will Also Be Given Free Tablets: Ramesh Pokhriyal

 

Students of Classes 6 To 12 To Receive Free Textbooks and Above Class 9 Will Also Be Given Free Tablets: Ramesh Pokhriyal

NVS: విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్స్‌, టెక్ట్స్‌ బుక్స్‌ - కేంద్ర విద్యాశాఖ నిర్ణయం 

గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నేతృత్వంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఎన్‌వీఎస్‌ స్కూల్‌ విద్యార్థులకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు

9, ఆపై తరగతులకు ఉచితంగా టాబ్లెట్స్‌ 

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నవోదయ విద్యా సమితి (NVS‌) స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్‌ బుక్స్‌, టాబ్లెట్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది. గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నేతృత్వంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

నవోదయ విద్యాలయ సమితి 40వ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్, విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ దోత్రేతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. 

అందులో భాగంగా 6 నుంచి 12 వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని.. 9వ తరగతి, ఆ పై తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్స్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా సీఎస్‌ఆర్‌ (CSR) నిధులతో హాస్టళ్లు, స్కూళ్ల పనితీరును మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌పై ప్రత్యేక చర్చ జరిగింది. వచ్చే ఏడాది నుంచి న్యూ ట్రాన్స్‌ఫర్ పాలిసీని అమల్లోకి తేవాలని నవోదయ విద్యాలయ సమితి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఇక ఇంజినీరింగ్ కేడర్‌కు సంబంధించి నియామక నిబంధనలను సరిదిద్దాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పూర్వ విద్యార్థులు నవోదయ స్కూళ్లను దత్తత తీసుకోవాలని నవోదయ విద్యాసమితి విజ్ఞప్తి చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags