మున్సిపల్ టీచర్లకు బదిలీ ఉత్తర్వులు
పురపాలక శాఖ పాఠశాలల్లో
పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల
చేసింది. బుధవారం ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి వై.
శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో పురపాలక విద్య కింద పని చేస్తున్న
ఉపాధ్యాయులను ఒక అర్బన్ లోకల్ బాడీ(యూఎల్‌బీ) నుంచి మరో యూఎల్బీకి బదిలీ చేయవచ్చని
పేర్కొన్నారు. సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు ఇతర నిబంధనలకనుగుణంగా
బదిలీలుచేపట్టాలని స్పష్టం చేశారు పురపాలక ఉపాధ్యాయ బదిలీలలో భాగంగా 2013లో 750 మందికి అంతర్ జిల్లా బదిలీలు జరిగాయని మున్సిపల్
టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ తెలిపారు. అయితే అప్పుడు,
ఇప్పుడు ప్రభుత్వం అంతర్ జిల్లా, అంతర్ యాజమాన్యబదిలీలకు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
బదిలీలలో ఎవరి ప్రమేయం ఉండదని, జూనియర్
మోస్ట్ గా డైరెక్ట్ పోస్టుల ఖాళీల్లో మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు
అయితే ప్రమోషన్ పోస్టుల్లో 70 శాతం కాకుండా.. డీఎస్సీ
పోస్టుల్లో 30 శాతం ఖాళీలకు మాత్రమే రోస్టర్ పాయింట్లు
కేటాయించాలని, ఆ యూనిట్లో జూనియర్ మోస్ట్ గా నమోదు చేయాలని
రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
PUBLIC SERVICE - MA&UD Dept. – Certain transfers of Teachers from one Urban Local Body to another Urban Local Body working under Municipal Education in the State of Andhra Pradesh - Orders – Issued.👇
G.O.RT.No. 34
Dated: 10-02-2021.
0 Komentar