TS: పదో తరగతిలో ఆరు
పరీక్షలే
తెలంగాణలో పదో తరగతి పరీక్షల
విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. 11 పరీక్షలకు
బదులుగా 6 పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ
మేరకు మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రథమ భాష, ఆంగ్లం, గణితం, సాంఘిన,
సామాన్య శాస్త్రాలకు ఒకే పరీక్ష ఉండేలా మార్పులు చేసింది. సైన్స్
పరీక్షలో భౌతిక, జీవ శాస్త్రాలకు వేర్వేరుగా సమాధాన
పత్రాలుండేలా ప్రభుత్వం మార్పులు చేసింది. అంతేకాకుండా ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు
ఇవ్వాలని ఎస్‌ఎస్‌సీ బోర్డును విద్యాశాఖ ఆదేశించింది. పరీక్ష సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటలకు పొడిగించారు. ఎప్పటిలాగే
ఎఫ్ఏ పరీక్షలకు 20, బోర్డు పరీక్షలకు 80 మార్కులు ఉంటాయని.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం
చేసింది. అయితే ఈ నూతన విధానం 2020-21 విద్యాసంవత్సారానికి
మాత్రమేనని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
0 Komentar