తెలంగాణలో ప్రవేశ పరీక్షల (CET) షెడ్యూల్
ఖరారు
జులై 5న ఎంసెట్
జూన్ 20న పీజీఈసెట్
జులై 1న ఈసెట్
రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జులై 5 నుంచి 9 వరకు టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 20న పీజీఈసెట్, జులై 1న ఈసెట్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు టీఎస్ ఎడ్‌సెట్, ఐసెట్, లాసెట్, పీజీలాసెట్, టీఎస్‌పీఈసెట్ పరీక్షల షెడ్యూల్ నిర్ణయించాల్సి ఉంది.
ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఎంసెట్‌ను జులైలో నిర్వహించాలని నిర్ణయించింది. ఎంసెట్, ఈసెట్ పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సీటీకి అప్పగించారు. టీఎస్ పీఈసెట్ నిర్వహణను ఈ ఏడాది కూడా మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగించారు. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ రెక్టార్ గోవర్ధన్, ఈసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి వ్యవహరించనున్నారు. ఐసెట్ కన్వీనర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాజిరెడ్డిని నియమించారు.
0 Komentar