టిఎస్: ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లో
EWS
ఆప్షన్ – రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం
ఉన్నత విద్యలోని సీట్ల భర్తీలో 10 శాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్) కోటా అమలు చేయాలని
ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్చిలో విడుదలయ్యే వివిధ నోటిఫికేషన్లలో
ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన లాసెట్, పీఈ సెట్ కమిటీ సమావేశాల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
వచ్చే విద్యాసంవత్సరం (2021-22) కోసం ఆయా ప్రవేశ పరీక్షల
నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అందుకు ఆన్ లైన్ దరఖాస్తు ఫారంలో ఈడబ్ల్యూఎస్
కోటాకు ప్రత్యేకంగా కాలమ్ ఇస్తారు. నిబంధనలు వర్తించే జనరల్ కేటగిరీ విద్యార్థులు
అవును, కాదు అని టిక్ కొట్టాలి. ప్రవేశాల నాటికి సంబంధిత
ధ్రువపత్రాలు సమర్పించాలి. లేకుంటే జనరల్ కోటా కింద పరిగణిస్తారు.
కొన్ని రాష్ట్రాలు మొత్తం సీట్లపై 10 శాతం పెంచి వాటిని కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నాయి. కేంద్ర
ప్రభుత్వం 20 శాతం పెంచి అమలు చేస్తోందని, అందులో 10 శాతం ఈడబ్ల్యూఎసకు ప్రత్యేకంగా, మిగిలిన 10 శాతాన్ని అందరికీ కేటాయిస్తారని ఉన్నత
విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఈడబ్ల్యూఎస్ కు 13 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. 10 శాతం సీట్లు
పెంచితే అన్ని ఉన్నత విద్యాకోర్సుల్లో 60 వేలకు పైగా సీట్లు
పెరుగుతాయి. ఒక్క బీటెక్ లోనే దాదాపు 10 వేల సీట్లు కొత్తగా
అందుబాటులోకి వస్తాయి. ఏ విధానాన్ని అమలు చేయాలన్న దానిపై ఓ కమిటీని నియమించాలని
విద్యాశాఖ భావిస్తోంది.
0 Komentar