టిఎస్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై
ఉత్తర్వులు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల
(ఈడబ్ల్యూఎస్) కు రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు అదనంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు
చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిలో భాగంగా తాజాగా ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని
విద్యాసంస్థల ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం
ప్రకటించిన తరుణంలో ఎంతో మంది నిరుద్యోగులు ఈ రిజర్వేషన్లు వినియోగించుకోనున్నారు.
దీని ప్రకారం రూ.8లక్షలలోపు
వార్షికాదాయం, 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి, 1000 చ.అడుగులలోపు ఇల్లు ఉన్న వారు, రెసిడెన్షియల్ ప్లాట్
109 చ.గజాలు, నాన్ మున్సిపాలిటీల్లో 209
చ.గజాల్లోపు ఉన్న వారికే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
0 Komentar