జ్యోతిబా పులె విదేశీ విద్యానిధి మళ్లీ అమలు - నేటి (ఫిబ్రవరి 4) నుంచి ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు
ఈ పథకం కింద రూ.20 లక్షల వంతున సాయం
కరోనా కారణంగా నిలిచిన మహాత్మా జ్యోతిబా పులె విదేశీ విద్యానిధి పథకాన్ని మళ్లీ అమలుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టభద్రులైన వెనకబడిన తరగతులు(బీసీ), ఆర్థికంగా వెనకబడిన తరగతుల(ఈబీసీ) విద్యార్థులు విదేశాల్లో పీజీ ఇతర ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించేందుకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.20 లక్షల వంతున సాయం అందిస్తోంది. 2020లో కరోనా కారణంగా నోటిఫికేషన్ వెలువడలేదు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ పథకంపై సమీక్ష నిర్వహించి అమలు చేయాలని నిర్ణయించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం కిందే మొత్తం 300 (285 బీసీ, 15 మంది ఈబీసీ) మందికి ఈ పథకం కింద సాయం అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 4 నుంచి ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. దరఖాస్తుల దాఖలుకు మార్చి మూడో తేదీ తుది గడువుగా పేర్కొన్నారు. పథకం వివరాల కోసం (http://telanganaepass.cgg.gov.in) సంప్రదించాలని సూచించారు.
అర్హులు: 35 ఏళ్లలోపు వయస్సు, ఇంజినీరింగు, మేనేజ్‌మెంటు, వ్యవసాయం, వైద్యవిద్య, నర్సింగ్, సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్, ఇతర డిగ్రీ కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండే పట్టభద్రులు దీనికి అర్హులు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత పొంది వీసా కలిగి ఉండాలి. కుల, ఆదాయ, పుట్టిన తేదీ, స్థానికత, ఆధార్, ఈపాస్ గుర్తింపు సంఖ్య, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్, తదితర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.
Last Date for Registrations: 03-03-2021
0 Komentar