TS: S.S.C Examination Schedule Released
టిఎస్: పదో
తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల
తేదీలను ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. మే 5వ తేదీ నుంచి మే 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది 11
పేపర్ల విధానానికి తెర దించుతూ పలు మార్పులు చేసిన విద్యా శాఖ కేవలం 6 పరీక్షలనే నిర్వహించనుంది.
ఈ నెల 25వ
తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు
చెల్లించవచ్చని బోర్డు వెల్లడించింది. రూ.50 ఆలస్య రుసుంతో
మార్చి 3 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో మార్చి 12 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 16 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు బోర్డు పేర్కొంది.
0 Komentar