TSPSC: స్టాఫ్ నర్సు
పోస్టుల మెరిట్ జాబితా విడుదల
25 నుంచి ధ్రువీకరణ పత్రాల
పరిశీలన
వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్సు పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరిశీలన ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి కమిషన్ కార్యాలయంలో జరుగుతుందని వెల్లడించింది.
అభ్యర్థులు అవసరమైన పత్రాలు, షెడ్యూలు కోసం వెబ్ సైట్ ని సందర్శించాలని సూచించింది. తుది మెరిట్ జాబితాలో మొత్తం 81 మంది అభ్యర్థుల సర్వీసు వెయిటేజీ మార్కులు మారాయి. తొలుత ప్రకటించిన జాబితాలో తప్పులు దొర్లడంతో స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. అర్హతలు ఉన్నప్పటికీ, సర్వీసు వెయిటేజీ మార్కులు సున్నా వచ్చినట్లు మెరిట్ జాబితాలో కమిషన్ పేర్కొంది. ఈ విషయాన్ని మరోసారి పరిశీలించిన కమిషన్ తొలుత 54 మంది అభ్యర్థుల మార్కుల్లో సాంకేతిక పొరపాట్లు జరిగాయని వెల్లడించి, సవరణ మార్కులు ప్రకటించింది. తాజాగా మరో 27 మంది అభ్యర్థుల వెయిటేజీ మార్కుల్లోనూ మార్పులు జరిగాయని, వైద్యవిధాన పరిషత్ నుంచి అందిన మార్కుల ఆధారంగా సవరణ చేసినట్లు ప్రకటించింది.
REVISED
MERIT LIST WITH QUALIFICATION AND SERVICE WEIGHTAGE
0 Komentar