స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్
జాబితా రద్దు: టీఎస్‌పీఎస్సీ
రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ, వైద్యవిధాన
పరిషత్‌లో స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది.
ఫిబ్రవరి 16న ప్రచురించిన జాబితాలో కొందరి వెయిటేజీ
మార్కుల్లో అచ్చుతప్పులు దొర్లాయి. అర్హతలు, అనుభవం ఉన్నా, వెయిటేజీ మార్కుల స్థానంలో సున్నా మార్కులుగా రావడంతో 54 మంది స్థానాల వివరాలు తారుమారయ్యాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఆయా
అభ్యర్థులకు వైద్యఆరోగ్యశాఖ కేటాయించిన మార్కుల వివరాలను వెల్లడించింది. సున్నా
మార్కులుగా వచ్చిన అభ్యర్థులకు వైద్య ఆరోగ్యశాఖ కేటాయించిన మార్కుల వివరాలను
చేర్చామని కమిషన్ వివరించింది. ప్రజారోగ్య, వైద్య విధాన
పరిషత్ నుంచి సర్వీసు వెయిటేజీ మార్కుల్లో మార్పులు జరిగితే వాటిని పరిగణనలోకి
తీసుకుంటామని స్పష్టం చేసింది. వివరాలను పరిశీలించిన తరువాత సవరించిన మెరిట్
జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న
విద్యార్హతలు, అనుభవం, ధ్రువీకరణ
పత్రాల పరిశీలనలో ఇచ్చిన వివరాల ఆధారంగా వెయిటేజీ మార్కులను గణించినట్లు టీఎస్‌పీఎస్సీ
పేర్కొంది.
0 Komentar