TSW RJC CET 2021 Notification Released for
Inter 1st Year Admissions
టీఎస్: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం టెన్త్ చదువుతున్న
అప్లయ్ చేసుకోవచ్చు
ఫిబ్రవరి 10
నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 28 దరఖాస్తులకు చివరితేది
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేశాఖ ఆధ్వర్యంలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌డబ్ల్యూ ఆర్‌జేసీ సెట్ (TSWRJC CET)-2021 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా గురుకుల జూనియర్ కాలేజీల్లోని సంప్రదాయ, వొకేషనల్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
ముఖ్య సమాచారం:
అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరంలో
(2020-21)
ఎస్‌ఎస్‌సీ లేదా సీబీఎస్సీ లేదా ఐసీఎస్‌ఈ ద్వారా పదో తరగతి
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రుల
ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షల లోపు
ఉండాలి.
వయసు: విద్యార్థుల వయసు 17
ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 10, 2021
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28, 2021
రాతపరీక్ష: ఏప్రిల్ 4, 2021
వెబ్‌సైట్: https://tswreis.in/
0 Komentar