Encourage Students to Take Online Exam
On "Cow Science": UGC To Universities
ఆవుపై ఆన్‌లైన్ పరీక్ష - విస్తృత ప్రచారం కల్పించండంటూ ఉప కులపతులకు యూజీసీ లేఖ
రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఈనెల 25న ఆవుపై దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తోందని, దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) లేఖ రాసింది. ఈ పరీక్ష జరుగుతుందన్న సమాచారాన్ని అనుబంధ కళాశాలలకూ తెలపాలని అందులో యూజీసీ సూచించింది.
‘‘మత్స్య,
పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 2019లో ఏర్పడిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్(ఆర్‌కేఏ) గురించి మీకు తెలుసు. ఈ
సంస్థ దేశీయ ఆవుల ఆర్థిక, శాస్త్రీయ, పర్యావరణ,
వ్యవసాయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక
ప్రయోజనాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కృషిచేస్తోంది. అందులో భాగంగా ఈ
నెల 25న ‘కామధేను గౌ విజ్ఞాన్ ప్రచార్-ప్రసార్ పరీక్ష’
నిర్వహిస్తోంది. ఇందులో ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ మాధ్యమిక పాఠశాలలతో పాటు కళాశాలల, విశ్వవిద్యాలయ
విద్యార్థులు, సాధారణ ప్రజానీకమూ పాల్గొనవచ్చు. ఈ పరీక్షను
వీలైనంత ఎక్కువ మంది రాసేలా ప్రోత్సహించండి’’ అని యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్
లేఖలో పేర్కొన్నారు. ఇంగ్లిష్‌తో పాటు ఈ పరీక్ష 11 ప్రాంతీయ
భాషల్లో జరగనుంది.
It is a good idea.
ReplyDelete