Aadhaar Not Mandatory for Jeevan Pramaan
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
‘జీవన్ ప్రమాణ్’కు ఆధార్ తప్పనిసరి కాదు
‘జీవన్ ప్రమాణ్’ నిబంధనలో
మార్పు
పింఛనుదారులు తమ పింఛన్లు
పొందేందుకు సమర్పించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ‘జీవన్ ప్రమాణ్’కు ఆధార్
ఉండాలన్న నిబంధన ఇకపై తప్పనిసరి కాదు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త
నిబంధన స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి పెన్షనర్లకు పంపే ‘యాప్’
సందేశాలకు, హాజరు నిర్వహణకు కూడా ఆధార్ పరిశీలన తప్పనిసరి కాకుండా,
స్వచ్ఛంద వ్యవహారంగా ఉంటుంది. ప్రతినెలా పింఛన్లు పొందడంలో ఆధార్
కార్డులు, వేలిముద్రలకు సంబంధించి తాము పలు ఇబ్బందులు
పడుతున్నామని పెన్షనర్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు పెద్దసంఖ్యలో వెళ్లడంతో ఈ
నిబంధన సవరించారు.
0 Komentar