ఉపాధ్యాయులు నేరుగా ప్రజాప్రతినిధులకు వినతులిస్తే చర్యలు
ఉపాధ్యాయులు, విద్యాశాఖకు
చెందిన ఉద్యోగులు నేరుగా ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యదర్శి,
సంచాలకులకు వినతిపత్రాలు ఇవ్వకూడదని ఆదేశిస్తూ పాఠశాల విద్యా
సంచాలకులు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్
నిబంధనలు 1964 ప్రకారం నేరుగా వినతులు ఇవ్వడం విరుద్ధమని పేర్కొన్నారు. సరైన
క్రమపద్ధతిలో కాకుండా నేరుగా వినతులను సమర్పించడం వల్ల రోజువారీ పనులకు ఆటంకం
ఏర్పడుతోందని వెల్లడించారు. నిబంధనలను
ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
0 Komentar