Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఇక ఆంధ్రా బ్యాంక్‌ యాప్ పనిచేయదు – పాత చెక్ లు చెల్లవు

 

ఇక ఆంధ్రా బ్యాంక్‌ యాప్ పనిచేయదు – పాత చెక్ లు చెల్లవు   

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌ విలీనం పూర్తయిపోయింది. ఈ క్రమంలో... ఆంధ్రాబ్యాంక్‌ కస్టమర్లందరూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లుగా సేవలు అందుకోనున్నారు. అయితే యూనియన్‌ బ్యాంకు మారినా పాత అకౌంట్‌ నెంబర్లు... అలాగే ఉంటాయి. వాటితోపాటు కస్టమర్‌ ఐడీలు కూడా పాతవే ఉంటాయి. అయితే... ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు కొత్త పాస్‌బుక్స్‌ అందిస్తారు. ఆ పాత బుక్స్‌ అన్నీ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో వస్తాయి. కాబట్టి పాత ఆంధ్రాబ్యాంక్‌ కస్టమర్లు‌ తమ పాస్‌ బుక్స్‌‌ను బ్యాంకులో మార్చుకోవచ్చు. ఇక ఆంధ్రా బ్యాంక్‌ యాప్‌ పని చేయదు. కస్టమర్లు యూ-మొబైల్ యాప్‌‌ను వినియోగించుకోవాలి.

ఇక ఆంధ్రా బ్యాంక్‌ చెక్స్‌ ఉంటే అవి మార్చి 31 వరకే పని చేస్తాయి. ఆ తర్వాత పని చేయవు. అంటే...  ఏప్రిల్‌ 1 నుంచి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  చెక్కులను మాత్రమే వినియోగించాలి. కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి కొత్త చెక్‌ బుక్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ కూడా మారుతుంది. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ ఈ నెల 31 వరకు మాత్రమే పని చేస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కొత్త ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ సంబంధిత బ్రాంచ్‌లో లేదా యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇక... ఏవైనా సందేహాలుంటే యూనియన్ బ్యాంక్ టోల్‌ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44  లలో తెలుసుకోవచ్చు, లేదా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110 ను సంప్రదించవచ్చు. 

ఇటీవల ఆంధ్రా బ్యాంక్‌ అన్ని బ్రాంచ్ ల ఐటీ ఇంటిగ్రేషన్‌ పూర్తయిందని యూనియన్‌ బ్యాంక్‌ ప్రకటించింది. గతంలో ఆంధ్రా బ్యాంకులుగా సేవలు అందించిన అన్ని సర్వీసులు, బ్రాంచ్‌లు, స్పెషలైజ్ఢ్‌ బ్రాంచులు... ఇప్పుడు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో అనుసంధానమయ్యాయి. 

ప్రస్తుతం దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యూనియన్‌ బ్యాంక్‌ ఐదో స్థానంలో ఉంది. నెట్‌వర్క్‌ విషయంలో నాలుగో స్థానంలో ఉంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 9,590 కి పైగా శాఖలు, 13,287 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags