ఏపి: పలు వర్సిటీలకు
ప్రవేశపరీక్షల బాధ్యతలు
ఏపీలో నిర్వహించే ప్రవేశ పరీక్షల
బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్సిటీలకు అప్పగించింది. ఎంసెట్ నిర్వహణ
బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు కేటాయించగా.. ఈసెట్ నిర్వహణను జేఎన్‌టీయూ
అనంతపురం,
ఐసెట్- ఏయూ విశాఖ, పీజీ సెట్ - ఎస్వీయూ
తిరుపతి, లాసెట్- శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తిరుపతి,
ఎడ్‌సెట్- ఏయూ విశాఖ, ఆర్క్ సెట్- ఏయూ
విశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్ల
బాధ్యతలు
ఎంసెట్ కన్వీనర్ గా జేఎన్‌టీయూ
కాకినాడ ప్రొఫెసర్ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ
పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి
అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా
వ్యవహరించనున్నారు.
ప్రవేశ పరీక్ష విశ్వవిద్యాలయం కన్వీనర్
ఎంసెట్ జేఎన్‌టీయూ, కాకినాడ
వి.రవీంద్ర
ఈసెట్ జేఎన్టీయూ, అనంతపురం
సి.శశిధర్
ఐసెట్ ఆంధ్ర జి.శశిభూషణ్
రావు
పీజీఈ సెట్ శ్రీవేంకటేశ్వర ఆర్‌విఎస్ సత్యనారాయణ
లాసెట్ శ్రీపద్మావతి మహిళ బి.చంద్రకళ
ఎడ్ సెట్ ఆంధ్ర కె.విశ్వేశ్వరరావు
ఆర్కిటెక్చర్ ఆంధ్ర వై.అబ్బులు
0 Komentar