AP Covid-19 Media Bulletin 09-03-2021
ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా, 118 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,884కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,176 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 89 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,670కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,038 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,43,07,165 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
0 Komentar