AP Covid-19 Media Bulletin 16-03-2021
ఏపీలో కొత్తగా 261 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 23,417
కరోనా పరీక్షలు నిర్వహించగా, 261
కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల
చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,92,269కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,185
మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 125 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,83,505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,579 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,45,80,783 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో
వెల్లడించింది.
0 Komentar