AP Covid-19 Media Bulletin 20-03-2021
ఏపీలో 380 కేసులు -
2 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా బారిన
పడుతోన్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24
గంటల్లో 30,978 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 380 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు చొప్పున
ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,93,366కి
చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,189కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 204 మంది
పూర్తిగా కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,094కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,083 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,47,05,188 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో
వెల్లడించింది.
0 Komentar