AP Covid-19 Media Bulletin 25-03-2021
ఏపీలో 758 కొత్త
కరోనా కేసులు
ఏపీలో మళ్ళీ భారీగా పెరుగుతున్న కరోనా
పాజిటివ్ కేసులు
కేవలం గత ఆరు రోజుల్లోనే
రాష్ట్రంలో 2,893 కేసులు
ఏపీలో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 35,196 నమూనాలను పరీక్షించగా 758 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,879కి చేరింది.
24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స
పొందుతూ నలుగురు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు,
విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా
మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన
వారి సంఖ్య 7,201కి చేరింది. ఒక్కరోజులో 231 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా..
ప్రస్తుతం 3,469 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు
1,48,75,597 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇటీవల
కాలంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఈనెల 20 నుంచి ప్రతిరోజూ
300కి పైగా కేసులు నమోదవుతున్నాయి. 20న 380, 21న 368,
22న 310, 23న 492, 24న
585 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నేటితో కలిపి కేవలం గత ఆరు
రోజుల్లోనే రాష్ట్రంలో 2,893 కేసులు నమోదుకావడం గమనార్హం.
0 Komentar