Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2021 Exam Dates Released

 

AP EAMCET-2021 Exam Dates Released

ఏపీ ఎంసెట్‌-2021 షెడ్యూల్‌ విడుదల - పరీక్ష తేదీలివే 

ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ తదితర ఇతర ప్రవేశ పరీక్షల తేదీలపై త్వరలో స్పష్టత రానుంది. 

జులై 12-15 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు

జులై 19,20 తేదీల్లో ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ పరీక్షలు 

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను, కన్వీనర్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ క్రమంలో ఎంసెట్ 2021 పరీక్షపై కూడా స్పష్టత ఇచ్చింది. ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు జులై 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 8 విడతలుగా ఇంజినీరింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు.  

బైపీసీ విభాగానికి సంబంధించిన పరీక్షను జులై 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. 

ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యమైనందున డిగ్రీ విద్యార్థులకు ఆగస్టు 6 వరకు క్లాసులు నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ తదితర ఇతర ప్రవేశ పరీక్షలను ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags