ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ విద్యార్థులు సంబంధిత పాఠశాల లాగిన్ ద్వారా తమ తమ పరీక్ష ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించవచ్చు. మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ ఫీజు చెల్లించవచ్చు. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా కూడా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు చెల్లించవచ్చునని పేర్కొన్నారు.
ఇక రూ. 50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు చెల్లించవచ్చు.
పరీక్ష ఫీజు వివరాలు:
ఇక రెగ్యూలర్ విద్యార్థులు పరీక్ష
ఫీజు 125 చెల్లించాలి.
బ్యాక్‌లాగ్ విద్యార్థులు 3
సబ్జెక్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.125 చెల్లించాలి.
మూడు సబ్జెక్ట్‌ల లోపు ఉంటే రూ.110 చెల్లించాలి.
నిర్ణీత వయసు కంటే తక్కువ వయసు గల
విద్యార్థులు రూ. 300 ఫీజు కట్టాలి.
మైగ్రేషన్ సర్టిపికేట్ కోసం రూ. 80 చెల్లించాలి.
టెన్త్ పరీక్షల షెడ్యూల్:
జూన్ 7(సోమవారం)
: ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 8( మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్
జూన్ 9(బుధవారం)
: ఇంగ్లీష్
జూన్ 10(గురువారం) : గణితం
జూన్ 11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్
జూన్ 12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్
జూన్ 14( సోమవారం) : సోషల్ స్టడీస్
జూన్ 15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
ఓఎస్‌ఎస్‌సీ మేయిన్ లాంగ్వేజ్
(సంస్కృతం, అరబిక్, పర్షియన్)
జూన్ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)
DIRECT LINK FOR ONLINE APPLICATION
User Manual, Instructions for Updating of SSC Nominal Rolls 2020-21
0 Komentar