Apple Says It Will Produce iPhone 12 In
India
భారత్‌లో ఐఫోన్ 12 తయారీ – ప్రకటించిన యాపిల్ కంపెనీ
స్థానిక వినియోగదార్ల కోసం భారత్‌లో ఐఫోన్ 12 తయారీని ప్రారంభించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. 2017 నుంచే ఈ కంపెనీ ఐఫోన్లను భారత్‌లో తయారు చేయిస్తోంది. చైనా నుంచి కొంత ఉత్పత్తిని భారత్‌కు అప్పట్లో బదిలీ చేసింది. ప్రస్తుతం తన కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల ద్వారా ఐఫోన్ ఎస్‌ఈ (2020), ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 11లను మన దేశంలో ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఐఫోన్ 12 మోడళ్లనూ ఇక్కడే తయారు చేయనుంది. అయితే ప్రొ మోడళ్లను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది.
2020లో భారత్‌లో తన మార్కెట్ వాటాను యాపిల్
రెట్టింపు చేసుకుంది. డిసెంబరు 2019లో ఈ కంపెనీ వాటా 2 శాతంగా ఉండగా.. డిసెంబరు 2020 త్రైమాసికానికి 4 శాతానికి చేరడం విశేషం. సంస్థ విక్రయాల్లో ఐఫోన్ ఎస్‌ఈ(2020) వాటానే 30 శాతంగా ఉండగా.. ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌లు 27%, 14% చొప్పున పొందాయి.
మిగతా వాటా ఐఫోన్ 12కు ఉంది. ఐఫోన్ 12 తయారీని భారత్‌కు బదిలీ చేయడం వల్ల, ఐఫోన్ 13 విడుదలలో ఆలస్యాన్ని పరిహరించవచ్చని యాపిల్ భావిస్తోంది.
0 Komentar