అటానమస్ కళాశాలల ప్రశ్నాపత్రాలు, మూల్యాంకనం
రద్దు - ఇంజినీరింగ్ కాలేజీలన్నింటికీ జేఎన్‌టీయూ పరీక్షలే
ఉన్నత విద్యలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వయంప్రతిపత్తి(అటానమస్) కళాశాలల్లో ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు అనంతపురం, కాకినాడ జేఎన్‌టీయూలు రూపొందించిన ప్రశ్నపత్రాలే ఇవ్వాలని, మూల్యాంకనం సైతం విశ్వవిద్యాలయాలే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిగ్రీ కళాశాలలకు ఆయా విశ్వవిద్యాలయాలే ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనం చేస్తాయన్నారు. అక్రమాల నిరోధానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
స్వయంప్రతిపత్తి కళాశాలల్లో పరీక్ష
విధానం,
జగనన్న విద్యాదీవెనపై గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన
సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే
పరిస్థితి ఉండాలి. విద్యార్థుల్లో నైపుణ్యం లేకపోతే మౌఖిక పరీక్షలను ఎదుర్కోలేరు.
ప్రతి ఒక్కరూ నైపుణ్యం, విషయ పరిజ్ఞానంతో విద్యా సంస్థ నుంచి
బయటకు రావాలి. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ
ఏముంటుంది? అందుకే ప్రతి కోర్సులో అప్రెంటిస్‌షిప్ విధానం
తీసుకురావాలని నిర్ణయించాం. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన
సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి. కొత్త సబ్జెక్టులను అందుబాటులో
ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లోని డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలించాలి’ అని
ఆదేశించారు.
0 Komentar