ఈ తేదీల్లో ఎస్‌బీఐ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు
బ్యాంకుల ప్రైవేటీకరణను
వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన ఉద్యోగ సంఘాలు ఈనెల 15, 16 తేదీల్లో
సమ్మెకు పిలుపు ఇచ్చినందున, ఆ రెండు రోజులూ సాధారణ బ్యాంకు
కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఎస్‌బీఐ
తెలియజేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయంతో పాటు, తిరోగమన
బాటలో ఉన్న బ్యాంకింగ్ సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ, సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక ట్విట్టర్‌లో
ప్రకటించింది. బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలు కొనసాగేందుకు అవసరమైన చర్యలు
తీసుకుంటున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.
0 Komentar