ఉపాధ్యాయ కోర్సులు బి.ఎడ్, ఎం.ఎడ్, బీపీ.ఎడ్ లు ఇక ఉన్నత విద్య పరిధిలోకి
ఉపాధ్యాయ కోర్సులు బి.ఎడ్, ఎం.ఎడ్,
బీపీ. ఎడ్ లను పాఠశాల విద్య పరిధి నుంచి ఉన్నత విద్య పరిధిలోకి
మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జిఓ 22ను
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం విడుదల చేశారు. ఉపాధ్యాయ
విద్యకు సంబంధించిన బిఇడి, ఎంఇడి, బిపిఇడి,
ఎంపిఇడి కోర్సులు ఇప్పటి వరకు పాఠశాల విద్య పరిధిలో ఉన్నాయి. ఈ
కోర్సులు ఇక నుంచి ఉన్నత విద్య పరిధిలోకి ప్రభుత్వం మార్చింది. ఇందుకు అనుగుణంగా
ప్రభుత్వ బిజినెస్ రూల్స్ లో సవరణలు చేయనున్నారు.
Transfer of subject matter of “B.Ed., M.Ed., B.P.Ed., M.P.Ed” from the School Education Department to
the Higher Education Department - Orders - Issued
G.O.MS.No. 22 Dated: 04-03-2021
0 Komentar