Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BITSAT- 2021 Notification Released - Registration Started, Eligibility, Syllabus and Preparation Tips Here

 

BITSAT- 2021 Notification Released - Registration Started, Eligibility, Syllabus and Preparation Tips Here

బిట్సాట్- 2021 నోటిఫికేషన్ విడుదల - అర్హత, సిలబస్, పరీక్షా విధానం మరియు ముఖ్యమైన తేదీలు

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్)-2021 ద్వారా బిట్స్ పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ప్రొగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 

రాజస్థాన్‌లోని పిలానీ ఇంజినీరింగ్& సైన్స్ విభాగాల్లో ఉన్నత విద్య, పరిశోధనలు చేయడానికి ఏర్పడిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్) 2021-22 అకడమిక్ ఇయర్‌కుగాను బిట్‌శాట్-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌ విధానం ఇక్కడి ప్రత్యేకత. ఆహ్లాదకరమైన క్యాంపస్‌ వాతావరణం, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన ఇక్కడి మరో ప్రత్యేకతలు. ఈ విద్యాసంస్థకు పిలానీ (రాజస్థాన్‌), గోవా, హైదరాబాద్‌లో క్యాంపస్‌లు ఉన్నాయి. 

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్)-2021 ద్వారా బిట్స్ పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ప్రొగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 

క్యాంపస్‌లు అందిస్తున్న కోర్సులు:

1. బిట్స్, పిలానీ – పిలానీ క్యాంపస్

బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్& ఇనుస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, మెకానికల్, మ్యానుఫాక్చరింగ్, బీఫార్మాసీ

ఎమ్మెస్సీ: బయలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్& జనరల్ స్టడీస్ 

2. బిట్స్, పిలానీ – కేకే బిర్లా గోవా క్యాంపస్

బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్

ఎమ్మెస్సీ: బయలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ 

3. బిట్స్, పిలానీ – హైదరాబాద్ క్యాంపస్

బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్& ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్ తదితరాలు

ఎమ్మెస్సీ: బయలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్

అర్హతలు:

ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ కోర్సులకు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ గ్రూపు తప్పనిసరి. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి కనీసం 75శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్/బయాలజీ సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2021లో ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్నవారు, 2020లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఫార్మసీ కోర్సుకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులు కూడా అర్హులే. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇంటర్‌లో సెంట్రల్, స్టేట్ బోర్డుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు బిట్‌శాట్ రాయకున్నా కోరుకున్న కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. 

పరీక్షా విధానం: బిట్‌శాట్-2021. పరీక్ష మొత్తం 150 మార్కులకుగాను 3గంటల సమయంలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి.

పార్ట్-1: ఫిజిక్స్- 40 ప్రశ్నలు,

పార్ట్-2: కెమిస్ట్రీ- 40 ప్రశ్నలు

పార్ట్-3: ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ – 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ – 10 ప్రశ్నలు

పార్ట్-4: మ్యాథమేటిక్స్/ బయాలజీ (బీఫార్మ్ అభ్యర్థులకు) – 45 ప్రశ్నలు

బిట్‌శాట్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు, తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ కింద 1 మార్కు తగ్గిస్తారు. 

బోనస్ మార్కులు: కేటాయించిన పరీక్ష సమయం కంటే ముందే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించిన అభ్యర్థులకు అదనంగా 12 ప్రశ్నలు ఇస్తారు. వీటికి సరైన సమాధానాలు గుర్తిస్తే అదనపు మార్కులు లభిస్తాయి. మ్యాథ్స్/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టు నుంచి నాలుగు చొప్పున ప్రశ్నలు ఇస్తారు. 

బోనస్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత మొదటి ప్రశ్నలను తిరిగి చూసుకోవడానికి గానీ, వాటి సమాధానాలను మార్చడానికి గానీ సాధ్యం కాదు.

పరీక్షా కేంద్రాలు: బిట్‌శాట్‌ను హైదరాబాద్ బిట్స్ క్యాంపస్, హైదరాబాద్ నగరం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాలతోపాటు దేశంలో మొత్తం 61 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. 

ముఖ్య సమాచారం:

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.3400 (పురుషులు), రూ.2900 (మహిళలు)

చివరి తేదీ: మే 29, 2021

పరీక్ష తేదీ: జూన్ 24 నుంచి 30 వరకు

WEBSITE

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags