Blood Donation Not Allowed For 2 Months
After 1st Vaccine Shot
కరోనా టీకా మొదటి డోసు తీసుకున్న 56 రోజుల తర్వాతే రక్త దానం చెయ్యాలి – టీకా తీసుకున్న రక్తదాతలకు ఎన్‌బీటీసీ కీలక ఆదేశాలు జారీ
అంటే రెండో డోసు తీసుకున్న 28
రోజుల తర్వాతే రక్తదానం
ఏ టీకా తీసుకున్నా అంతే - ఎన్‌బీటీసీ
ఆదేశాలు జారీ
కరోనా టీకా రెండో డోసు
వేయించుకున్న 28 రోజుల తర్వాతే రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన నేషనల్
బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్(ఎన్‌బీటీసీ) డైరెక్టర్ డాక్టర్ సునీల్
గుప్తా ఆదేశించారు. ఈ లెక్కన తొలి డోసు తీసుకున్నాక 56 రోజుల పాటు రక్తదానం
చేయరాదని టీకా లబ్ధిదారులకు ఎన్‌బీటీసీ నిర్దేశించింది.
రెండు డోసులు తీసుకున్న తర్వాతే
శరీరంలో వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారు అవుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇది వరకే
వెల్లడించింది. అలాగే టీకా తీసుకున్నాక ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలా అనే విషయంలో
ఏర్పడిన సందేహాన్ని ఆరోగ్యశాఖ ఇటీవల నివృత్తి చేసింది. మద్యపానం వల్ల టీకా
ప్రభావశీలత తగ్గిందనడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని నిపుణులు పేర్కొన్నట్లు
తెలియజేసింది.
0 Komentar