కొత్త ‘ప్రైవసీ’ పాలసీని అమలు
చేయకుండా వాట్సాప్‌ను నిరోధించండి’ - దిల్లీ హైకోర్టును కోరిన కేంద్రం
కొత్త గోప్యతా విధానం (ప్రైవసీ పాలసీ) విషయంలో ముందుకెళ్లకుండా వాట్సాప్‌ను నిరోధించాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది. వాట్సాప్ కొత్త గోప్యతా విధానం వల్ల దేశ సమాచార భద్రత, చట్టాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సీమా సింగ్, మేఘా సింగ్ అనే ఇద్దరు మహిళలు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో కేంద్రం తరఫున ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం తన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కొత్త గోప్యతా విధానం తీసుకురాకుండా వాట్సాప్‌ను నిరోధించాలని అందులో పేర్కొంది.
వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త
గోపత్యా విధానాన్ని వినియోగదారుడు తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే
యాప్ నుంచి వైదొలగాలి. దీనిపై భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు
వెల్లువెత్తడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. దీని అమలును మే 15కు
వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎవరి ఖాతాను రద్దు, సస్పెండ్
చేయబోమని ప్రకటించింది. యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకుంటోందని
ఆందోళనల నేపథ్యంలో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని వాట్సాప్ పేర్కొంది.
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్‌డ్ టెక్నాలజీని వినియోగిస్తుండటంతో మెసేజ్‌లను తాము
కూడా చూడలేమని ఇప్పటికే స్పష్టం చేసింది.
0 Komentar