తెలంగాణలో లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి
క్లారిటీ
కరోనా నేపథ్యంలో తాత్కాలికంగానే విద్యాసంస్థలు మూసివేశామని, తొందరపడి లాక్‌డౌన్ పెట్టబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ కొందరు సినీ పెద్దలు నన్ను కలిసి మళ్లీ లాక్‌డౌన్‌పై వస్తున్న ప్రచారం గురించి అడిగారు. లాక్ డౌన్ విధించే అవకాశం ఉందా? అని అడిగారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టామని వివరించారు. కొన్ని సినిమాలు నిర్మాణ మధ్యలోనే ఉన్నాయని చెప్పారు. లాక్ డౌన్ వల్ల గతేడాది చాలా నష్టపోయాం. తొందరపడి లాక్ డౌన్ పెట్టబోం. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కరోనా విస్పోటనమైన రూపం తీసుకోక ముందే చర్యలు తీసుకున్నామన్నారు. బాధతోనే
విద్యాసంస్థలు మూసివేశామని సీఎం వివరించారు. కరోనా మహమ్మారి ఎవరికీ అంతుపట్టకుండా
తెలంగాణ సహా ప్రపంచాన్ని వేధిస్తోందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం
చేతుల్లో ఉందని, టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు సమానంగా
పంపిణీ చేస్తోందని సీఎం వివరించారు.
0 Komentar