డీఎస్సీపై త్వరలోనే నిర్ణయం: ఏపీ
విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, రాష్ట్ర
స్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్‌ఈ విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర
విద్యా శాఖ వెల్లడించింది. మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. గత మూడు
నెలలుగా ప్రభుత్వ బడులను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొంది. గతేడాది కంటే ఎక్కువ మంది
విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని వెల్లడించింది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సీ నిర్వహణ అంశం సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల వద్ద పెండింగ్ లో ఉందని, అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు విజయవాడలోని ఆర్ ఆండ్ బి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించామన్నారు. ఏటా డిఎస్సి నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, టెట్ డిఎస్సిలో భాగంగా నిర్వహించాలా వేరుగా నిర్వహించాలా అనే అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది టెట్ తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు.
0 Komentar