Deep Nostalgia: 'Creepy' New Service
Uses AI to Animate Old Family Photos
ఫొటోలూ కదులుతాయ్ - కృత్రిమ మేధ ఆధారంతో పాత కుటుంబ ఫోటోల అద్భుతం
మన చిన్నపుడెపుడో కన్నుమూసిన పెద్దవారిని ఫొటోల్లో చూసి బాధ పడటమే కానీ వారిని, వారి కదలికల్ని మనం తిరిగి తీసుకురాలేం. కేవలం పెద్దవారివే కాక మన చిన్ననాటి ఫొటోలైనా, లేదా ఏవైనా సాధారణ ఫొటోలకు కూడా కదలిక వస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే ఓ సంస్థ కృత్రిమ మేధ సాయంతో ఫోటోలకు జీవం పోసేలా సరికొత్త ఆవిష్కరణ చేసింది. వివరాల్లోకెళ్తే.. ఇజ్రాయెల్‌కు చెందిన వంశవృక్ష సంబంధిత పరిశోధనలు చేసే ‘మై హెరిటేజ్’ అనే సంస్థ తమ వెబ్‌సైట్‌లో రెండు వారాల క్రితం డీప్ నాస్టాల్జియా పేరుతో ఓ కొత్త ఫీచర్ను ప్రారంభించింది. అందులో మనం ఏ ఫొటోలనైనా ఎంచుకొని అందులోకి వ్యక్తులు కదిలేలా చేయొచ్చు. కృత్రిమ మేధ సాయంతో జరిగే ఈ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను ఆ సంస్థ ఒక బ్లాగ్‌లో వివరించింది.
ముందుగా మై హెరిటేజ్ సంస్థ
అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఫ్యామిలీ ట్రీ అనే విభాగాన్ని ఎంచుకొని మన
ఫొటోలను అందులో అప్‌లోడ్ చెయ్యాలి. ఫొటోలో ఎవరు కదలాలనుకుంటున్నారో వారిని
ఎంచుకోవాలి. తర్వాత ఆ వీడియోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా షేర్ చేయ్యొచ్చు.
తాజాగా ఒక ట్విటర్ వినియోగదారుడు
భగత్‌సింగ్, స్వామి వివేకానంద, బాల గంగాధర
తిలక్ వంటి ప్రముఖుల ఫొటోలు ఎంచుకొని వాటికి ఈ ఫీచర్‌ను యాడ్ చేశారు. చరిత్రలో
భాగమైన మహానుభావుల ఫొటోలకు కదలికలు రావడం చూస్తుంటే మరో అద్భుతాన్ని
ఆవిష్కరించినట్లే ఉంది. ఇంకెందుకాలస్యం వాటిని మీరూ చూసేయండి.
DIRECT LINK FOR ANIMATED PHOTOS
Abraham Lincoln brought to life by #DeepNostalgia pic.twitter.com/YXABWUsw98
— Brandon Jacobs 🚀 (@brandorak) February 28, 2021
Kind of surreal to take a photo of the singularly inspiring Bhagat Singh -- a revolutionary voice in 1920s India, who was hung by the British in 1931, at the age of 24 -- run it through the Heritage AI algorithm, and see him reanimated. pic.twitter.com/CfC0Gu6Gxk
— Keerthik Sasidharan (@KS1729) February 28, 2021
0 Komentar